calender_icon.png 29 November, 2024 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్తనడకన సబ్ సెంటర్ పనులు

29-11-2024 12:35:57 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2౮(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పా ల్వంచలోని వెంగళరావుకాలనీలో నెషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో రూ.16లక్షలతో స బ్‌సెంటర్ నిర్మాణం చేపట్టారు. ప్రజలకు వై ద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో చేపట్టి న నిర్మాణానికి అధికారుల అలసత్వం శాపం గా మారింది.

ఐటీడీఏ ఇంజినీరింగ్, రెవె న్యూ అధికారుల సమన్వయం లోపం కారణంగా సబ్ సెంటర్ పనుల్లో జాప్యం జరు గుతున్నది. కాంట్రాక్ట్ సమయం ముగిసినా సబ్ సెంటర్ మొండిగోడలతో వెక్కిరిస్తున్న ది. ఈ ఏడాది ఫిబ్రవ రిలో పనులు మొదలవగా 9 నెలల్లో పూర్తి చేసేలా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

సబ్ సెంటర్‌కు అవసరమైన భూమిని అప్పగించాల్సిన రెవెన్యూ అధికారుల ఆలస్యం కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగింది. రోడ్డు పక్కన భూమిని కేటాయించాలని కలెక్టర్ ఆదేశిస్తే తహసీల్దార్ వెనుకభాగంలో కేటాయించార ని.. అక్కడికి వెళ్లడానికి రోడ్డు లేదని కాలనీవాసులు వాపోతున్నారు.

ఈ విషయమై ఐ టీడీఏ డీఈ మధుకర్‌ను వివరణ కోరగా.. స్థ లం కేటాయించడంలో ఆలస్యం కారణంగా నే సబ్ సెంటర్ నిర్మాణం పూర్తి కాలేదన్నా రు. ప్రస్తుతం అగ్రిమెంట్ సమయం ముగిసిందని, నిర్మాణం పొడిగింపునకు మళ్లీ అనుమతి పొందాల్సి ఉందన్నారు.