calender_icon.png 25 December, 2024 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల సుడిగుండంలో ఎస్‌యూ

14-09-2024 12:00:00 AM

  1. అక్రమాలకు చిరునామాగా పరీక్షల నియంత్రణ విభాగం 
  2. అనర్హుడికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా నియామకం 
  3. విచారణ చేసి ప్రక్షాళన చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్

కరీంనగర్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం పరీ క్షల నియంత్రణ విభాగం వివాదాల సుడిగు ండంలో చిక్కుకుంది. పరీక్షల నియంత్రణ వి భాగంలో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని, ఆ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని డి మాండ్ చేస్తూ నాలుగు రోజుల క్రితం ఏబీవీపీ నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త తలకు దారితీసిన సంగతి తెలిసిందే. శాతవాహన యూనివర్సిటీలో పరీక్షల నియంత్రణ విభాగం(కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్) ఇది విశ్వవిద్యాలయానికి గుండెకాయలాంటిది.

దీనికి ఇంచార్జిగా డాక్టర్ ఎన్వీ శ్రీరంగప్రసాద్ కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో ఇచ్చిన రెగ్యులర్ నోటిఫికేషన్ ఆ ధారంగా రిక్రూట్‌మెంట్ జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ విశ్వవిద్యాల యాలు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ పలు విశ్వవిద్యాలయాలు కూడా రద్దు చేశారు.

ఇదే శాతవాహన విశ్వవిద్యాలయంబీ 2013లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయడం గమనార్హం. 2015 అక్టోబర్ నెలలో హై కోర్టు ఇచ్చిన కండిషన్ ఆర్డర్ ప్రకారంగా  అ సిస్టెంట్ ప్రొఫెసర్‌గా బిజినెస్ మేనేజ్‌మెంట్ లో శ్రీరంగప్రసాద్ ఉద్యోగంలో చేరారు.

జాయిన్ అయిన వెంటనే అడిషనల్ కంట్రోలర్ (కాన్ఫిడెన్షియల్)గా అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. తర్వాత మాజీ వీసీ ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ వీసీగా నియామకమైన తర్వాత ఒక సీనియర్ ప్రొఫెసర్‌ను కాదని అనర్హుడైన శ్రీరంగప్రసాద్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా పూర్తి బాధ్యతలతో 2021లో నియామకం చేశారు.

2016 నుంచి 2024 వరకు వివిధ హోదాల్లో పరీక్షల ని యంత్రణ విభాగంలో ఆయనే పనిచేస్తున్నా రు. ఆయన నియామకమైన సంవత్సరం ను ంచే వివిధ అడ్మినిస్ట్రేటిట్ బాధ్యతల్లో పనిచే స్తూ పరిశోధన రంగానికి సేవలు చేయడం లో విఫలమయ్యారు. 2021లో జరిగిన పేప ర్ లీకేజీ వెనుక ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. లీకేజీపై కేసులు పెట్టి కమిటీలతో ఈ అంశాన్ని నిర్వీర్యం చేశారు. 

ఇష్టారీతిగా పరీక్ష ఫీజు పెంపు

పరీక్షల నియంత్రణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీరంగప్రసాద్..  వివిధ రూపాల్లో పరీక్షల ఫీజు పెంచుతూ రావడం పేద విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిం ది. పరీక్షల నియంత్రణ అధికారిగా ఉంటూ వివిధ కాలేజీల్లో విద్యార్థులకు జరిగే మేనేజ్‌మెంట్ వైవా, ప్రాజెక్ట్ వంటి పరీక్షలకు నిబం ధనలు తుంగలో తొక్కి హాజరయ్యారు. ప్రైవే ట్ కాలేజీల ఒత్తిడి, నచ్చిన కాలేజీలకు ర్యాం కులు ఇచ్చారని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. మాజీ వీసీ మల్లేశం ఈయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏకఛత్రాధిపత్యానికి బీజం పడినట్టయింది.

వివిధ కాలేజీలలో నిర్వహించే పరీక్షా కేంద్రం నుంచి జవాబు పత్రాలు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగానికి చేరిన తర్వాత జవాబు ప త్రాలను బయటకు పంపించి తిరిగి విశ్వవిద్యాలయానికి చేరవేయడం వెనుక ఈయన హస్తం ఉందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించాలని సామాజిక కార్యకర్తలు పలు దఫాలు గా ఆందోళనలు కూడా నిర్వహించారు. ప రీక్ష కేంద్రాల కేటాయింపులు, పరిశీలకులు, స్కాడ్‌ల నియామక ఉత్తర్వులు ఈయన చేసేవారు. దీని వెనుక కూడా చేతివాటం ఉందన్న విమర్శలు ఉన్నాయి. 

జవాబు పత్రాల డిజిటలైజేషన్ కుంభకోణం

విశ్వవిద్యాలయంలో జరిగిన అతిపెద్ద కుంభకోణంలో పరీక్ష జవాబు పత్రాల డిజిటలైజేషన్ అని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ స్కానింగ్ ప్రక్రియ ఎలాంటి టెండర్ లేకు ండానే నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చారన్న అభియోగాలు ఉన్నా యి. అనుభవం లేని కోసిన్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పజెప్పడం వెనుక భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు బహిరంగ ంగానే వచ్చాయి.

కరోనా అనంతరం చేపట్టిన ఈ జవాబు పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ 2020 విద్యాసంవత్సరానికి స ంబంధించిన జవాబు పత్రాలు, 2021 నుంచి 2024 వరకు నాలుగు విద్యాసంవత్సరాల జవాబు పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ, యూజీ, పీజీ, ప్రొఫెషనల్ వి ద్యార్థుల మూ ల్యంకనానికి మొదటగా రూ.11, తర్వాత విద్యాసంవత్సరం రూ.12.40, ఆ తర్వాత రూ. 18, తాజాగా రూ.20 వరకు ఎలాంటి టెండర్ లేకుండానే అందించా రు. 10 లక్షలకుపైగా జవాబు పత్రాలకు కోట్ల రూపాయలు చెల్లించి, అందినకాడికి దోచుకున్నారన్నారని సమాచారం.

2022 స్టేట్ ఆడిట్ రిపోర్టులో దీని పై అభ్యంతరం కూడా చేశారు. ఈ విధా నం వల్ల పేద విద్యార్థుల మీద అధికంగా పరీక్ష రుసుం భారం పడింది. తాజాగా వీటన్నింటిపై విచారణ జరిపించాలనే ఆందోళనలు మొదలయ్యాయి. శాతవాహన వర్సి టీ అభివృద్ధి, పేద, మెరిట్ విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలనే డిమాండ్ తాజాగా తెరమీదకి వచ్చింది.