calender_icon.png 24 September, 2024 | 2:56 AM

బావి అంచున పిల్లాడితో స్టంట్స్..

24-09-2024 12:56:37 AM

న్యూఢిల్లీ: ఓ మహిళ ప్రమాదకర రీతిలో పిల్లాడిని చేతిలో పట్టుకుని రీల్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బావి అంచున కూర్చున్న ఆ మహిళ పిల్లాడిని చేతిలో పట్టుకుని భయంకర రీతిలో స్టంట్స్ చేసింది. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్స్ ఆ మహిళ తీరును తప్పుబడుతూ కామెంట్లు చేస్తున్నారు. మరీ వ్యూస్ కోసం ఇంతలా దిగజారుతావా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సమాజం ఎటువైపు వెళ్తోందని కామెంట్లు చేస్తున్నారు.