calender_icon.png 25 February, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్లు

17-02-2025 11:15:44 PM

ఇద్దరిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు..

వివరాలు వెల్లడించిన ఏసిపి శ్రీనివాస్ రావు..  

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో ప్రమాదకరంగా విన్యాసాలు చేసిన ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సోమవారం సాయంత్రం శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపి శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. ఈనెల తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు ఔటర్ రింగ్ రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు పెద్ద గోల్కొండ గ్రామ పరిధిలో ఉన్న రింగ్ రోడ్డుపై ప్రమాదకరంగా ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించే విధంగా తమ కార్లతో వాహనాలతో విన్యాసాలు చేశారు. వీరి వాహనాలకు నెంబర్ ప్లేట్లు కూడా లేవు. ఔటర్ పెట్రోలింగ్ సిబ్బంది కే. శ్రీశైలం ఈ విషయమై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో ఎస్ఐ భాస్కరరావు తన సిబ్బందితో కలిసి సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు నిందితులను గుర్తించారు. అత్తాపూర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్లా అన్సారి, అదేవిధంగా మలక్పేట్ చెందిన జుబేర్ సిద్ధికిగా గుర్తించి వారిని సోమవారం అరెస్టు చేశారు. కార్లను పిఎస్ కు తరలించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్ రావు హెచ్చరించారు. యువత బాధ్యతయుతంగా మెలగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఎస్ఐ భాస్కరరావు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.