calender_icon.png 30 October, 2024 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాస్తవానికి దగ్గరగా స్టంట్స్

29-06-2024 12:05:00 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఓదెల2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.మధు నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్ సింహ, యువ, నాగ మహే శ్, వంశీ, గగన్, విహారి, సురేందర్‌రెడ్డి, భూపాల్, పూజారెడ్డి తదితర తారాగణం ఇందులో నటిస్తోంది. 2021లో సంపత్ నంది తీసిన ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా ఈ మల్టీ లింగ్వల్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటుండగా, అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా ‘ఓదెల2’లోని కీలకమైన యాక్షన్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు మేకర్స్. కొన్ని ఇన్నోవేటివ్ స్టంట్స్, యాక్షన్ సీన్లను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరిస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ‘ఆడియన్స్‌కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు’ అని మేకర్స్ చెప్పారు. ‘కాంతార’ ఫేమ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీలో, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్షన్‌లో సహకారం అందిస్తున్నారు.