చెన్నై: 'సర్దార్ 2" సినిమా సెట్ లో ప్రమాదం చోటుచేసుకుంది. స్టంట్ మ్యాన్ మృతిచెందాడు. కార్తీ హీరోగా సర్దార్ 2 సినిమా తెరకెక్కుతోంది. 20 అడుగుల ఎత్తు నుంచి స్టంట్ మ్యాన్ ఎజుమైలై కిందపడ్డాడు. ఛాతీలో తీవ్రగాయంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో స్టంట్ మ్యాన్ ఎజుమలై ఇరువై అడుగుల ఎత్తు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. విరుగంబాక్కం పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. స్టంట్ సమయంలో భద్రతా పరికరాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆకస్మిక, విషాదకరమైన ఘటన చిత్ర నిర్మాణ బృందంపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఇది చిత్రీకరణను వెంటనే నిలిపివేయడానికి దారితీసింది. ఈ చిత్రానికి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.