calender_icon.png 21 December, 2024 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టంట్ మ్యాన్.. ఏజెంట్ యాక్షన్

16-10-2024 12:06:23 AM

సమంత ఒక పెద్ద బ్రేక్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా రు. సమంత నటించిన వెబ్ ప్రాజెక్ట్ సిటడెల్ నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్టంట్ మ్యాన్ బన్నీ, ఏజెంట్ హనీ చుట్టూ ఈ కథ తిరగనుంది. యాక్షన్ సన్నివేశాల్లో సమంత అద్భుతంగా నటించారు.

యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్‌తో ఈ వెబ్ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. సమంతకు అయితే ఇది మంచి కమ్ బ్యాక్ అవుతుందనడంలో సందేహం లేదు. రాజ్ డీకే ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు. రాజ్ అండే డీటుఆర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. కేకే మీనన్, సిమ్రన్, సోహం మజుందార్, శివంకిత్ పరిహార్, సాఖిబ్ సలీం తదితరులు కీలక పాత్ర పోషించారు.