calender_icon.png 12 January, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బురపడేలా అంతర్వాహిని పుష్కరాలు!

12-01-2025 12:55:08 AM

  1. కాళేశ్వరం ప్రతిష్ఠ ఇనుమడించేలా ఏర్పాట్లు 
  2. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీ నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లలో రాజీపడొద్దని, ఇందుకోసం కేటాయించిన రూ.25కోట్లను సద్విని యోగం చేసుకోవాలని అధికారులను ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు.

కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లలో కాశి, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో స్నానఘట్టాల ఆధునీకరణ, రోడ్ల నిర్మాణం,  శానిటేషన్ పనులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని సూచించారు. శనివారం సచివాల యంలో పుష్కరాల ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. సరస్వతి పుష్కరాలకు వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కాళేశ్వరం సంగమ స్థలంలో మాత్ర మే సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి కూడా  భక్తులు రానున్న నేపథ్యంలో హెలికాప్టర్ జాయ్ రైడ్ల కోసం హెలిప్యాడ్లకు మరమ్మతులు చేయాలని, కాళేశ్వరం ప్రతిష్ఠ నలుదిశలా వ్యాపించేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. దేవాదా య, నీటి పారుదల, రోడ్లు భవనాలు, పం చాయతీరాజ్, రెవెన్యూ, టూరిజం, ట్రాన్స్ కో, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు నిర్వహించనున్న కుంభాభిషేకం పనులను ఎక్కడా లోపం లేకుండా చేపట్టాల న్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తీశ్వ ర ఆలయం క్యాలెండర్ ఆవిష్కరించారు.

సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ కమిషనర్ శ్రీధర్, జాయింట్ కమిషన్ రామకృ ష్ణా రావు, ఎస్‌ఈ దుర్గాప్రసాద్, టూరిజం ఎండీ ప్రకాశ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మల్సూర్ నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, డీపీవో నారాయణరావు, ఇరిగేషన్ ఈఈ తిరుపతి, డీపీఆర్‌వో శీలం శ్రీనివాసరావు, కాళేశ్వరం ఈవో మారుతి, భూపాలపల్లి ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, డీఎం ఇందు పాల్గొన్నారు.