15-03-2025 09:24:59 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్...
పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పిట్లం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించి, ఐ.ఎఫ్.పి ప్యానెల్ పై, బాల్య వివాహాల అనర్థాలపై పోస్టర్ తయారు చేయించారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కృషి చేయాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
తదనంతరం మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లల పెంపకం, వారి పౌష్టికాహారంపై తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడంలో తల్లిదండ్రుల పాత్రను ప్రాముఖ్యంగా చర్చించి, తగిన మార్గదర్శకాలు అందించారు. అలాగే ఎన్ఆర్సీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, సమన్వయకర్త వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.