calender_icon.png 11 January, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకాగ్రతతో చదివి లక్ష్యం సాధించండి

06-12-2024 10:13:40 PM

ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రతి విద్యార్థిని ఏకాగ్రత కోల్పోకుండా, మంచివారితో స్నేహం చేసుకొని చదువు పట్ల మక్కువ చూపించి తాను అనుకున్నది లక్ష్యం సాధించేవరకు ప్రయత్నం చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఇల్లందు మండలం భూపేష్ నగర్ తండకు చెందిన వాంకుడోత్ వర్షిని, భద్రాచలం గురుకులం కళాశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివి, 10వ తరగతిలో 10/10 గ్రేడ్ సాధించి, ఇంటర్మీడియట్ సిరోల్లో సిఓఈ లో చదివి జేఈఈ మెయిన్స్ ఎంట్రెన్స్ రాసి 72 మార్కులతో ఉత్తీర్ణత పొంది, 3067 ర్యాంకు రావడంతో చత్తీస్గడ్ రాష్ట్రం ఎన్ ఐ టి రాయపూర్ ఇంజనీరింగ్ లో సీట్ రావడం జరిగిందని, ప్రస్తుతం ఈ విద్యార్థి రెండవ సంవత్సరం మైనింగ్ ఇంజనీరింగ్ చదువుతున్నదని, గిరిజన సంక్షేమ శాఖ తరపున ల్యాప్టాప్ ను అందించడం జరిగిందని ఆయన అన్నారు.

మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులో అత్యుత్తమ మార్కులతో పాసై మంచి పేరు తేవాలని, మంచి ర్యాంకు సాధించిన ఆమెకు సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, తల్లి భారతి సమక్షంలో ల్యాప్టాప్ ను అందించి, ఈ విద్యార్థిని పై చదువులు చదవడానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆర్థిక సాయం అందించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. అత్యుత్తమ ర్యాంకు రాయపూర్ లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు రావడానికి కృషిచేసిన తల్లిదండ్రులకు, కళాశాల ప్రిన్సిపాల్ లకు, అధ్యాపకులకు, విద్యార్థికి అభినందిస్తూ భవిష్యత్తులో తాను అనుకున్నది తప్పకుండా సాధించాలని ఆయన ఆశీర్వదిస్తూ, ఈ విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులు పదవ తరగతిలో 10/10 గ్రేడ్ సాధించి పై చదువులు చదవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు, విద్యార్థి తల్లి భారతి, తదితరులు పాల్గొన్నారు.