నిర్మల్ (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు బాగా చదివి మంచి గ్రేడ్ సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఉన్నారు. శనివారం నిర్మల్ అర్బన్ నిర్మల్ మండలంలోని వివిధ పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయులకు విద్యార్థులకు పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా చూడాలని ఆకాంక్షించారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.