calender_icon.png 24 January, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాగా చదివి ఉత్తమ గ్రేడ్లు తెచ్చుకోవాలి

23-01-2025 07:08:20 PM

లోకేశ్వరం (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు బాగా చదివి ఉత్తమ గ్రేడ్లు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. గురువారం లోకేశ్వరం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.