calender_icon.png 8 January, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సాగర్’ స్పిల్‌వేపై గుంతలు పూడ్చేందుకు అధ్యయనం

08-01-2025 01:35:03 AM

* రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ స్పిల్‌వేపై గుంతలు పూడ్చేందుకు ఐఐటీ రూర్కీ నిపుణులు అధ్యయనం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. నెల్లికల్లు ఎత్తిపో తల, నాగార్జున సాగర్ హై లెవల్, లో లెవల్, లింక్ కెనాల్, స్పిల్ వేపై గుంతల పూడ్చివేతపై హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వానకాలం నాటికి సాగు జలాలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే 24,624 ఎకరాల ఆయకట్టు సేద్యంలోకి వస్తుందన్నారు.

ఏఎంఆర్, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల పరిధిలోని 90.43 కి.మీ మేర కాలువల పరిధిలో మరమ్మతులు చేయాలని నిర్ణయించామన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని 39 ఐడీసీ ఎత్తిపోతల పథకాల్లో ఎక్కువ భాగం పనిచేయ డం లేదని, వాటిని గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

అనుమల చెక్‌డ్యాం నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడిం చారు. సమావేశంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ నేత కె.జానారెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఈఎన్సీలు అనిల్ కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్, నల్గొండ సీఈ కె.శ్రీధర్, ఎస్‌ఈ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.