calender_icon.png 18 April, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యం ఛేదించేలా చదవాలి

10-04-2025 01:28:43 AM

జిల్లా కలెక్టర్ మను చౌదరి 

సిద్దిపేట, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యం దిశగా చదవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మన చౌదరి సూచించారు. బుధవారం దుబ్బాక మండలం లోని హబ్సిపూర్ గ్రామ పరిధిలో గల మహాత్మ జ్యోతిబా పూలే బిసి సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.

వంట గదిలో వండిన అన్నం, కూరలను పరిశీలించి రుచి చూసి కూరల్లో ఉప్పు సరి సమానంగా వేయాలని,  తాజా కూరగాయలు వాడాలని, వంటగది పరిసర ప్రాంతాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా చూసుకోవాలని, కొత్త డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని వంట సిబ్బందీని ఆదేశించారు.

స్టోర్ గదిని పరిశీలించి పసుపు, కారం, నూనె ఇతరత్రా వస్తువులు నాణ్యత పరమైన మాత్రమే వాడాలని కాలం చెల్లిన సరుకులు వాడకూడదని, స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని సూచించారు. మరుగుదొడ్లను పరిశీలించి నిరంతరంగా వాటర్ వచ్చే విధంగా, బ్లీచింగ్ చేయాలని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ స్టడీ అవర్స్ లో గణిత సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చెయ్యాలని సూచించారు. 

మీకు కావాల్సిన డర్మటరి గదులు, మరుగుదొడ్లకు డోర్స్, తరగతి గదులకు కిటికీలు, మైదానంలో కూర్చొని తినే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఎంఈఓ ప్రభుదాస్, తహసీల్దార్ సంజీవ్, ఎంపీడీవో భాస్కర శర్మ, పాఠశాల ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డిలు ఉన్నారు.