calender_icon.png 11 October, 2024 | 12:50 AM

19న దక్షిణ కొరియాకు అధ్యయన బృందం?

10-10-2024 12:29:30 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మూసీ సుందరీకరణ వైపు రాష్ట్రప్రభుత్వం వడి వడిగా అడుగులు వేస్తున్నది. దీనిపై ఇప్పటికే ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గత నెల 28న సచివాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూసీ సుందరీకరణకు త్వరలోనే అధికారుల బృందం విదేశాలకు పర్యటిస్తుందని ఇదే రోజు ప్రకటించారు.

దీనిలో భాగం గానే ఈ 19న హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు బయల్దేరి వెళ్తారని తెలిసింది.  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సైతం బృందం లో ఉంటారని సమాచారం.

బృందం 24 వరకు అక్కడే ఉండి సియోల్‌లోని హేన్ నది సుందరీకరణపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నద ని, నదితో పాటు పరీవాహక ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించనున్నదని సమాచారం. పర్యటనపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, టూర్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్నది.