బీసీ కమిషన్
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాం తి): సంచార జాతుల స్థితిగతులను అధ్యయ నం చేసేందుకు ఈ నెల మూడో వారంలో వారు నివసించే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని బీసీ కమిషన్ నిర్ణయించింది. శుక్రవారం బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో గతంలో జరిగిన బహిరంగ విచారణలో తమ కులాల పేర్లను సమాజంలో న్యూనతాభావంతో చూస్తున్నారని ఆయా పేర్లను మార్చాలని విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు.
దొమ్మర, పిచ్చగుంట్ల, తమ్మలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి కులాల ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. కుమ్మర, రజక, మేర కులాలవారికి ప్రస్తుత పేర్లకు అదనంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పేర్లను పర్యాయపదాలుగా చేర్చాలనే విషయాన్ని కూడా చర్చించినట్లు చెప్పారు. వీటిపై నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, ఈనెల 4 నుంచి 18 వరకు అభ్యంత రాలు అందజేయాలని కోరారు. సమావేశంలో సభ్యులు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి పాల్గొన్నారు.