calender_icon.png 2 January, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్

30-12-2024 01:45:26 AM

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ర్టంలోని డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్‌ను రూపొందించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ స్టడీ మెటీరియల్‌ను మండలి అందుబాటులోకి తీసుకురానుంది.

సబ్జెక్టుకు చెందిన ముఖ్యాంశాలు గ్రహించేలా, పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ స్టడీ మెటీరియల్ తోడ్పడుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. లోతైన అధ్యయనం చేసేవారి కోసం రెఫరెన్స్ పుస్తకాల వివరాలను సైతం ఈ స్టడీ మెటీరియల్‌లో పొందుపరుస్తామన్నారు. పోటీపరీక్షల అభ్యర్థులు రూపొందించుకునే స్టడీ మెటీరియల్‌లా ఇది ఉంటుందన్నారు.

డిగ్రీ కోర్సుల సిలబస్‌ను 30 శాతం చొప్పు న మార్చాలని ఇప్పటికే మండలి నిర్ణయించింది. కొత్త సిలబస్‌ను రూపొం దిస్తుంది. పరిశోధనను ప్రోత్సహించేలా ఈ సిలబస్‌ను రూపొంది స్తున్నా రు. ఇదిలా ఉండగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా స్టడీ మెటీరియల్‌ను రూపొందించే పనిలో మండలి వర్గాలు ఉన్నాయి.