13-02-2025 01:53:45 AM
చైతన్య ఫార్మసీ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి
తిమ్మాపూర్, ఫిబ్రవరి 12: విద్యార్థులందరూ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఫామ్ డి ప్రతి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పష్టమైన ప్రణాళికతో విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు అనంతరం ఫ్రెషర్స్ డే వీక్ లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ రామ నర్సింహారెడ్డి, హె ఓ డి అప్పారావు, రవీందర్ రెడ్డి, రాంప్రసాద్ పాల్గొన్నారు.