calender_icon.png 27 December, 2024 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టుదలతో చదివి ఉన్నతంగా ఎదగాలి

01-08-2024 12:29:25 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, జూలై 31: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని హనుమాన్ నగర్‌లో జడ్పీహెచ్‌ఎస్, గిరినగర్‌లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. గిరినగర్ పీహెచ్‌సీలోని రిజిస్టర్‌ను పరిశీలించి, అన్ని రకాల పరీక్షలు చేసి మందులు పంపిణీ ఇస్తున్నారా అని రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ అన్నింటిని టీ హబ్‌కు రెగ్యులర్‌గా పంపుతున్నారా అని ఆరా తీశారు.

అనారోగ్య సమస్యలతో వచ్చే వారికి నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. హనుమాన్ నగర్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌ను పరిశీలించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. పదో తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతిలో 10/10 జీపీఏను సాధించేలా చదవాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం యతిపతిరావు, ఉపాధ్యాయుడు ఎండి గౌస్, మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్, వైద్యసిబ్బంది ఉన్నారు.