calender_icon.png 8 February, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడి చదివి ఉన్నత స్థానాలు పొందాలి

08-02-2025 12:45:16 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల ను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసారు.

ఈ సందర్భంగా తొలుత 10 వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. రోజువారి కార్యక్రమలు చదువు, ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఫిజికల్ ఫిట్నెస్, భోజనం ఎలా వుంది, సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షల సమయంలో టెన్షన్ పడవద్దని, ధైర్యంగా ఉండాలని తెలిపారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని వంద శాతం రిజల్ట్ రావాలని తెలిపారు.

అనంతరం తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూం లను పరిశీలించి ప్రతీ రోజు కిచన్ గదులను శుభ్ర పరచాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, ప్రిన్సిపాల్ శివరాం, జోనల్ ఆఫీసర్ పూర్ణ చందర్, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, మండల విద్యాధికారి ఆనంద్ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.