calender_icon.png 21 February, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టంగా చదివి మంచి మార్కులు సాధించాలి

14-02-2025 12:42:42 AM

 భాష్యం స్కూల్ జెడ్ ఈవో మార్కండేయులు 

మేడ్చల్, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి): పదవ తరగతి విద్యార్థులు ఇష్టంగా చదివి మంచి మార్కులు సాధించాలని భాష్యం స్కూల్ జడ్ ఈవో మార్కండేయులు అన్నారు. గురువారం ఏఎస్ రావు నగర్ బ్రాంలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

భయం, మానసిక ఒత్తిడికి గురికా వద్దన్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ అమరేశ్వర మాట్లాడుతూ 20 25 జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచిన సాయి మనోజ్ఞ భాష్యం స్కూల్లో చదివారన్నారు.

మీరు కూడా రాష్ర్టస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. వీడ్కోలు సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.