కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జనవరి 31: విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థులకి వడ్డించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజూ భోజనం ఎలా ఉంటుంది, ఏం వడ్డిస్తున్నారు అనీ విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు.
తదుపరి పాఠశాలలో నిర్వహిస్తున్న కెరియర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అనే అంశంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులకు సరియైన మార్గ నిర్దేశం చేస్తూ చక్కని సలహాలు ఇవ్వాలనీ సూచించారు.
విద్యార్థులు భవిష్యత్తులో స్థిరపడేలా సరియైన మార్గ నిర్దేశం చేయాలన్నారు. పదో తరగతి ఫలితాలలో జిల్లాను ప్రధమ స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ , క్వాలిటీ కోఆర్డినేటర్ జనార్ధన్, ప్రిన్సిపాల్ బి.రమేష్ రిసోర్స్ పర్సన్స్ మారం పవిత్ర, శ్రీనివాస్ పాల్గొన్నారు.