ప్రవచనకర్త గరికపాటి
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు జ్ఞానం కోసం చదువుకోవాలని మహసహస్త్ర అవధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రవచనకర్త డాక్టర్ గరికపాటి నర్సింహరావు అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అయ్యప్ప సేవా సమితి నిత్యాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ప్రవచనాలు చేశారు. శివునికి కార్తీకమాసం అత్యంత ప్రియమైందన్నారు. వైదిక ధర్మం ఎంతోగొప్పదని, అందరూ అనుసరించదగ్గదని పేర్కొన్నారు.