కామారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు క్షేత్రస్థాయి సందర్శన లో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడీ గ్రా మానికి వచ్చారు. గ్రామానికి చెందిన రైతు ముసుకు సంతోష్‌రెడ్డి పండిస్తున్న పత్తి చేనులో వారు వ్యవసాయ పనులు చేశారు. సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతు ల గురించి రైతు వివరించారు. వర్సిటీలో చదవిన పాఠాలను సాగులో అన్వయించా ల్సిన విధానంపై తమకు అవగాహన వచ్చిం దని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన బాగుందన్నారు.