- మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు
- 300 కాలేజీల గుర్తింపుపై ఎటూతేల్చని ఇంటర్ బోర్డు
- ఇంకా నిర్ణయం తీసుకోని అధికారులు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): అటు ఇంటర్ బోర్డు అధికారులు.. ఇటు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడబోతోంది. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ఇంటర్ కాలేజీలకు గతంలో రెండేళ్లపాటు ప్రత్యేక అనుమతిని ఇంటర్ బోర్డు ఇచ్చింది.
అయితే ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు 2023 విద్యా సంవత్సరంతోనే ముగిసింది. ఈ విద్యాసంవత్సరానికిగానూ గుర్తింపు కోసం ప్రైవేట్ కాలేజీలన్నీ ఈ ఏడా ది మార్చిలోనే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న 300 కాలేజీలకు మినహా మిగతా కాలేజీలకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లభించింది.
కానీ మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకున్నా ఆయా కాలేజీల యామజమా న్యాలు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టి కాలేజీలను నిర్వహిస్తున్నారు. అయితే గతేడాది ఈ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా కాలేజీలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఫస్టియర్‌లో చేరే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అండర్ టేకింగ్ లెటర్‌ను తీసుకోవాలని కాలేజీలకు అధికారులు ఆదేశా లు జారీ చేశారు.
‘వచ్చే విద్యాసంవత్సరంలో ఈ కళాశాలకు గుర్తింపు రాకున్నా.. ఈ కాలేజీలో ఇప్పుడు చేరడం మాకిష్టమే’ అని గతేడాది ఆయా కాలేజీలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ రాయించుకున్నారు. ఆయా కాలేజీల్లో గతేడాది ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇప్పుడు సెకండి యర్‌లో ఉన్నారు.
వార్షిక పరీక్ష ఫీజు షెడ్యూల్ కూడా రావడంతో విద్యార్థుల నుంచి ఫీజు లూ కట్టించు కుంటున్నారు. ఒకవేళ వీటికి ఇంటర్ బోర్డు అధికారులు గుర్తింపు ఇవ్వకుంటే తమ పిల్లల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏడాది షరామామూలే!
కాలేజీల గుర్తింపునకు నోటిఫికేషన్ ఇవ్వ డం.. తొలుత కొన్ని కాలేజీలకే గుర్తింపునివ్వ డం.. నిబంధనల పేరుతో మరికొన్ని కాలేజీలకు నిలిపివే యడం..ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ పేరుతో అన్ని కాలేజీలకు సైతం గుర్తింపునివ్వడమనేది ప్రతి ఏటా షరామామూలే అన్నట్టుగా తయారైంది. రాష్ట్రంలో 1,580 ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలున్నాయి.
వీటిలో చాలావరకు బహుళ అంతస్తుల (మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ) భవనాలు, ఇరుకు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. 2024 -25 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు)కు ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్చి 31 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, రూ.20 వేల ఫైన్‌తో మే 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువిచ్చారు. వీటిలో మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కాలేజీలూ ఉన్నాయి. ప్రస్తుతం గుర్తింపు లేకున్నా ఇవి నడుస్తున్నాయి.
ఈ కాలేజీలకు అధికారులు అనుమతినిస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. ప్రతి విద్యాసంవత్సరంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయా కళాశాలలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేయడం, వాటికి అనుమతి ఇచ్చేయడం షరామామూలు అన్నట్లుగా తయారైంది.