28-04-2024 12:03:07 AM
యూపీలో ఇద్దరుప్రొఫెసర్ల నిర్వాకం
గవర్నర్ ఆదేశాలతోవిచారణ కమిటీ నియామకం
లంచం తీసుకుని విద్యార్థులను పాస్ చేసిన వైనం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఉత్తర్‌ప్రదేశ్ జౌన్‌పుర్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయంలో ఇద్దరు ప్రొఫెసర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పరీక్ష పత్రాల్లో జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసినవాళ్లను పాస్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే యూనివర్సిటీకి చెందిన దివ్యాన్షు సింగ్ అనే విద్యార్థి గతేడాది ఆగస్టు 3న ఆర్‌టీఐ ద్వారా పరీక్ష పత్రాల రీఎవాల్యూయేషన్ చేయాలని దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
క్రికెటర్ల పేర్లు రాసిన వాళ్లకూ..
విద్యార్థులను పాస్ చేసేందుకు ప్రొఫెసర్లు వినయ్ వర్మ, ఆశీష్ గుప్తా లంచం తీసుకున్నారని దివ్యాన్షు ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పరీక్ష పత్రాలపై జైశ్రీరామ్‌తోపాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి క్రికెటర్ల పేర్లు రాసిన వాళ్లకు అనూహ్యంగా ఎక్కువ మార్కులు వచ్చినట్లు దివ్యాన్షు సమర్పించిన ఆధారాల్లో ఉంది. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని 2023 డిసెంబర్ 21 రాజ్‌భవన్ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా యూనివర్సిటీ పాలనా విభాగం విచారణ కమిటీని నియమించింది. పరీక్ష పత్రాలను పరిశీలించిన స్క్రూటినీ కమిటీ.. కనీసంగా 4 మార్కుల వ్యత్యాసాన్ని గమనించింది.