calender_icon.png 2 April, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంట్రల్ యూనివర్సిటీలో అప్రజస్వామికంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలి

31-03-2025 08:41:36 PM

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీస్ లను తక్షణమే సస్పెండ్ చేయాలి..

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్..

సంగారెడ్డి (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల వేలం అమ్మకాన్ని, ఇచ్చిన సర్కులర్ ను తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిరసన కార్యక్రమం నిర్వహించిన వారిని అరెస్టు చేయడం తగదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ అన్నారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల అమ్మకానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే అక్రమంగా విద్యార్థులపై పోలీసులుతో లాఠీఛార్జి అరెస్టులు చేయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని అలాగే... అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తు అరెస్ట్ చేసిన వాళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల వేలం సర్కులర్ వెనక్కి తీసుకోవాలన్నారు. భూముల వేలం సర్కులర్ వెనక్కి తీసుకొని ఎడల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని సమీకరించి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.