స్టీమ్ కోర్సులను ఎంచుకోవాలి
తిమ్మాపూర్, ఫిబ్రవరి 3: దేశ విదేశాలలో ఉన్నత విద్యను ఇష్టపడే విద్యార్థులు స్టీమ్ కోర్సులు, అంతర్జాతీయ విద్యార్థులకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అందించే విశ్వవిద్యాలయాలను ఎంచుకోవాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విశ్వవిద్యాలయాల నిపుణులు తెలిపారు.
సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గల జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విశ్వవిద్యాలయాల డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్ కీర్తి శ్రీ వాచ్చవ్, ఇండియానా యూనివర్సిటీ ఇండియానా పోలీసులోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రియా కుర్లే లతో విద్యార్థులకు సెమినార్ క్యాంప్ నిర్వహిం చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్కడి కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలతో పాటు స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియను నావిగేటెడ్ చేయడానికి ట్రిక్కులను రూపొందించడం కోసం వారికి అందజేశారు. టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వంటి స్టీమ్ విద్యతో పాటు ఇంటర్ డిసి ప్లీనరీ విధానంలో ఉన్నత విద్యలో వివిధ కెరీర్ మార్గాలను ఎంచుకునే స్టీమ్ తో పాటు ఇతర కోర్సులైన ఎంబీఏ మిళితం చేసే దిశగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వం హైదరాబాదులో తన కాన్సోలేట్‌ను ప్రారంభించిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్ర యోజత విశ్వవిద్యాలయం అయిన గ్రాండ్ వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులకు అందుబాటు లో ఉన్న అవకాశాల గురించి అవగాహన కల్పించారు. ఈ సెమినార్‌లో కళాశాల చైర్మన్ జువ్వా డి సాగర్ రావు, ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.