- వంట సహాయకులు రాకపోవడంతో కుక్‌కు సహాయంగా..
- తనిఖీల్లో ఎమ్మెల్యే కంటబడిన విద్యార్థినులు
- వసతి గృహం అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
కామారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జం గంపల్లి కస్తూర్భా బాలికల గురుకులంలో వంట సహాయకులు లేకపోవడంతో విద్యార్థినులే పూరీలు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే కంటపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం ఉదయం కస్తూర్భా బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.
ఆ సమయంలో పాఠశాల విద్యార్థినులు పూరీలు చేస్తూ ఎమ్మెల్యే కంటపడ్డారు. దీంతో అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వంట సహాయకులు రాకపోవడంతోనే కుక్‌కు సహాయంగా పూరీ లు చేస్తున్నట్లు విద్యార్థినులు ఎమ్మెల్యేకు తెలిపారు.
అలా చేయొద్దంటూ విద్యార్థినులకు ఎమ్మెల్యే సూచించారు. తల్లితండ్రులు చదువుకోవాలని పంపించారని ఇలాంటి పనులు చేయవద్దని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలసి ఎమ్మెల్యే అల్ఫాహారం చేశారు. అనంతరం భిక్కనూర్ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.