రెండు బంగారు, రెండు రజత పతకాలు కైవసం
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 3 (విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కొత్త గూడెం సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. ఈ నెల 2, 3 తేదీల్లో ఖమ్మంలోని సర్దార్ వల్లబాయ్ పటేల్ స్టేడి యంలో కాకతీయ విశ్వవిద్యాలయ ఇం టర్ కాలేజీ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో కొత్తగూడెం సాంఘిక సంక్షేమ గురుకు ల డిగ్రీ కళాశాల విద్యార్థినులు నాలుగు పతకాలు సాధించారు. 10,000 మీట ర్ల రన్నింగ్ పోటీలో పాయం ఉషారా ణి, 5,000 మీటర్ల రన్నింగ్ పోటీలో బంగారు పతకాలు సాధించారు. 1,500, 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో ఎం టాబు రజత పతకాలు సాధించా రు. విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపా ల్ ఝాన్సీరాణి, పీడీ స్పందన ఆదివారం అభినందించారు.