09-04-2025 12:37:02 AM
ప్రమాదాలకు గురవుతున్న విద్యార్థులు
పట్టించుకోని కాంట్రాక్టర్
గోపాలపేట ఏప్రిల్ 8: ఓ సదురు కాంట్రాక్టర్ బిల్లులు చేసుకునేందుకు గోతులు తొవ్వి వదిలేసినా వైనం గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ ముందు దర్శనమిస్తుంది. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ ముందు ఉన్న స్థలం ఆట స్థలం చుట్టూ కాంపౌండ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కానీ ఆ ఆట స్థలం నాలుగు వైపుల కాంపౌండ్ నిర్మాణం చేపట్టవలసి ఉంది కానీ ఆ పాఠశాలకు ఆటో స్థలం చుట్టూ రెండువైపుల మాత్రమే కాంపౌండ్ నిర్మాణం చేపట్టారు. మరో రెండువైపులా కాంపౌండ్ నిర్మాణం ఆ కాంట్రాక్టర్ చేపట్ట లేకపోయారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒకవైపు స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని అటువైపున కాంపౌండ్ నిర్మాణం చేపట్టలేదు.
అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ముందుభాగం నుంచి హనుమండ్లగడ్డ కాలనీకి వెళ్లాలన్నా అదే విధంగా శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి వెళ్లాలన్నా దారి ఈ పాఠశాల ముందు నుంచే ఉంది. కాబట్టి పాఠశాల ముందు భాగాన కాంపౌండ్ నిర్మాణం చేపట్టాలని ఆ కాంట్రాక్టర్ పాఠశాల ముందు పెద్దపెద్ద గోతులు తొవ్వించారు. గ్రామానికి చెందిన కొంతమంది అక్కడ పనులను ఆపివేశారు. ఈ పాఠశాల ముందు కాంపౌండ్ నిర్మాణం చేపడితే బండ్లకు కానీ పెద్ద పెద్ద వాహనాలు ఇక్కడి నుంచి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని అంతేకాకుండా పాఠశాలకు అడ్డుగా ఉంటుందని కాంపౌండ్ నిర్మాణం నిలిపివేశారు.
ప్రమాదాలకు గురవుతున్న విద్యార్థులు.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు కాంట్రాక్టర్ గోతులు తవ్వి వదిలేయడం పట్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. విద్యార్థులు పాఠశాలకు రావాలన్నా ఆట సమయంలో విద్యార్థులు ఆ క్రీడా మైదానంలో ఆడుకోవాలని గోతిలో పడి గాయాలకు గురవుతున్నారు. ఈ గోతులతోవి సుమారుగా ఆరు మాసాలు కావస్తున్నది. ఆ పాఠశాల పిడి సురేందర్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు ఆ కాంట్రాక్టర్కు విన్నవించుకున్నారు ఈ కోతుల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వీటిని వెంటనే పూడిపించేయండి అని చెప్పినా కూడా చెవి పట్టనట్టు ఉన్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. వెంటనే స్పందించి తెరిచి ఉన్న గోతులను వెంటనే పూడ్చివేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
గోపాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు పాఠశాలకు అడ్డుగా కాంపౌండ్ వాల్ నిర్మా ణం చేపట్టేందుకు గుంతలు తీశారు. ఆ కాం పౌండ్ వాల్ నిర్మా ణం పట్ల పాఠశాలకు అడ్డుగానే కాకుండా రహదారికి ఇబ్బందిగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ నిర్మా ణం చేపట్టకుండా తీసిన గుంతలను పూడిచివేసి విద్యార్థులు అందులో పడకుండా ప్రమాదాలకు గురికాకుండా చూడాలి.
గాజుల కోదండ గోపాల్పేట