calender_icon.png 12 December, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలినడకన కలెక్టరేట్‌కు విద్యార్థినులు

11-07-2024 12:28:42 AM

ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్

12 కిలోమీటర్లు నడిచిన బాలెంల విద్యార్థినులు

రాత్రి వరకు కలెక్టరేట్ ఎదుట స్టూడెంట్స్ ధర్నా

సూర్యాపేట, జూలై10 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శిరీషను సస్పెండ్ చేయాలని కోరుతూ బుధవారం కళాశాలలోని సుమారు 200పైగా విద్యార్థినులు 12 కిలోమీర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రిన్సిపా ల్ శైలజ కళాశాల బీరువాలోనే మద్యం బాటిళ్లు పెట్టుకుని, తాగి వేదింపులకు గురిచేస్తే.. ఉన్నతాధికారులు కంటితుడుపు చర్యగా బదిలీ చేయడం సరికాదని తేల్చి చెప్పారు. ఆమెను సస్పెండ్ చేయాల్సిందేన ని డిమాండ్ చేశారు.

ప్రిన్సిపాల్‌ను బదిలీ చేసి ఆమె స్థానంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నియమించడం సరికాదన్నారు. ప్రిన్సిపాల్‌కు సహకరించిన కేర్‌టేకర్ సౌమిత్రిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కలెక్టర్ కమిటీ వేసి విచారణ చేస్తామని ప్రకటించి, విచారణ పూర్తి కాకుండానే ఎలా బది లీ చేశారని ప్రశ్నించారు. అయితే అదే సమ యంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బాలెంలలోని కళాశాలను పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యార్థినులను కళాశాలలో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థినులను కళాశాలకు రావాలని, ఇక్కడే విచారిస్తానని చెప్పినా విద్యార్థినులు ఒప్పుకోలేదు. గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రావాలంటూ రాత్రి వరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత కలెక్టర్ తన ఛాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, విద్యార్థి నులను బస్సుల్లో కాలేజీకి పంపారు.