21-02-2025 04:25:58 PM
టేకులపల్లి (విజయక్రాంతి): పిహెచ్ డి రీసెర్చ్ వర్క్ కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం ఇల్లందు మార్కెట్ కమిటీ అదీనంలో గల టేకులపల్లి మార్కెట్ సబ్ యార్డును సందర్శించారు. రైతులు పండించే పంటలు, వారికి వచ్చే దిగుబడి, ధరలు వివరాలను విద్యార్థులు రైతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న మార్కెటింగ్ అధికారులు విద్యాద్రులకు అమ్మకాలు, కొనుగోళ్లు, పండించి మార్కెట్కు తీసుకొచ్చే విధానాన్ని వివరించారు.