12-03-2025 06:39:19 PM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డి పల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నవత్ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఉదయం తరగతులు బోధిస్తూ పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని, డిఈఓగా సొయాప్,ఎం ఈఓగా రిషిక, హెచ్ఎంగా మధుప్రియ, ఉపాధ్యాయులుగా రక్షిత, షర్మిల, సహస్త్ర, నందిత, కీర్తన, సంజయ్, వర్షిత్, రామ్ చరణ్, లక్ష్మణ్, కార్తీక్ లు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుమతి, రజనీదాస్, చర్ల రామకృష్ణ, సుమలత, పాల్గొన్నారు.