06-04-2025 06:25:56 PM
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జాతీయస్థాయి నెట్ బాల్ పోటీ(National Netball Championship)ల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో ఇటీవల జరిగిన నెట్ బాల్ నేషనల్ విభాగంలో దీప్తి, కీర్తన లు సిల్వర్, బ్రాంజ్ మెడల్ సాధించారు. నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అలీబిన్ అహ్మద్ మాట్లాడుతూ... జిల్లాలో నెట్ బాల్ క్రీడలను విస్తృత పరిచేందుకు గత ఆరు సంవత్సరాలుగా కృషి చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్ ఆదిత్య రెడ్డి, కార్యదర్శి శిరీష రాణి, తిరుపతి అభినందించారు.