23-03-2025 06:16:00 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ లోని బాలికల ఉన్నత పాఠశాలలో బ్లూ బర్డ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కలర్ బెల్ట్ టెస్టులలో విద్యార్థులు ప్రతిభ చూపారు. 200 మంది విద్యార్థులు ఈ టెస్టులో విజయం సాధించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ కోచ్ లు భార్గవ్, స్వామి, శ్రీను, వెంకట్, అక్షయ్, శివ, సూర్య, తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ నాగరాజు మాట్లాడుతూ... విద్యార్థినీ విద్యార్థులకు ఆత్మ రక్షణకు కరాటే అవసరమని అన్నారు.