calender_icon.png 30 March, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబడ్డీ, ఖో ఖోలో విద్యార్థుల ప్రతిభ

27-03-2025 09:56:41 AM

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మాజీ జెడ్పిటిసి అరిగేలా నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎంపీపీ కప్ క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల(Mahatma Jyotiba Phule Girls' Gurukul School) విద్యార్థినిలు జూనియర్ విభాగంలో ని ఖో ఖో, కబడ్డీ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబాయి విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉత్సాహం ఉన్న విద్యార్థులను క్రీడల పట్ల ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని  సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.