హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి) : నిజాం కళాశాలలో నిర్మించి న గర్ల్స్ హాస్టల్‌ను పూర్తిస్థాయిలో డిగ్రీ విద్యార్థినులకే కేటాయించాలని ఆ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజాం కాలేజీ ఆవరణలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యా ర్థులు మాట్లాడుతూ.. 2022లో కూడా ఇదే డిమాండ్‌తో ఆందోళన చేపట్టినప్పుడు వసతిగృహంలోని గదులను మొత్తాన్ని పూర్తిస్థాయిలో డిగ్రీ విద్యార్థులకే కేటాయిస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారన్నారు. కానీ ప్రస్తుతం ప్రిన్సిపాల్ మాట మార్చి డిగ్రీ, పీజీ విద్యార్థినులకు సమానంగా ఇస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పీజీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలో వసతి గృహాన్ని కేటాయించాలన్నారు.