స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల హక్కు
ప్రభుత్వం విద్యార్థులకు భిక్ష కాదని గ్రహించాలి
విద్యార్థులకు ఏబీవీపీ నాయకుల మద్దతు
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కామారెడ్డిలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజాం సార్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ భిక్ష కాదని అది విద్యార్థుల హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్ అన్నారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కర్షద్ బీడీ కళాశాల నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం నిజాం సార్ చౌరస్తా దిగ్భం నుంచి ధర్నా నిర్వహించారు ప్రభుత్వం వెంటనే బకాయి పడిన స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లు ఇవ్వక పోవడం వల్ల కళాశాలల యజమాన్యాలు సర్టిఫికెట్ల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫీజులు కడితే సర్టిఫికెట్లు ఇస్తామని పేర్కొంటున్నారని అన్నారు. దీనితో పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులను ఆదుకోవాలని వారు కోరారు.