నిర్మల్ (విజయక్రాంతి): సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కారణంగా కేజీబీవీ పాఠశాలలో ఉన్న సిబ్బంది సమ్మె చేయడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వ వెంటనే చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేందర్ అన్నారు. ఆదివారం నిర్మల్ కేజీబీవీ పాఠశాలల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 13 రోజులుగా పాఠశాలలో విద్యాబోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం చర్చ జరిపి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విన్నవించారు.