calender_icon.png 22 April, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యంపై విద్యార్థులు శ్రద్ధవహించాలి

18-04-2025 12:00:00 AM

డాక్టర్ లారా మీనన్

ముషీరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డాక్టర్ లారా మీనన్ అన్నారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని రెయిన్బో హోం అనాధాశ్రమంలో విద్యార్థినీలకు ఆర్బీఎసికె ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ లారా మీనన్ మాట్లాడు తూ... పౌష్టిక ఆహారం తీసుకోవాలని, ప్రతిరోజు కొద్ది సేపు వ్యాయామం చేయాలని సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎసికె ప్రతినిధులు శ్రీదేవి, ప్రజ్ఞా, రెయిన్బోహోం ఇన్చార్జి సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.