11-04-2025 01:40:55 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఏప్రిల్ 10 ( విజయక్రాంతి) : విద్యార్థినులు ఉన్నత లక్ష్యంతో చదవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె పెద్దవూరలోని గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేసి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు. భోజనం ఎలా ఉందని? ఎలా చదువుకుంటున్నారని? అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకోవాలని చెప్పారు.
ఐఐటీ లక్ష్యంగా చదివే విద్యార్థులకు నల్గొండలో ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని, ఎంత మందికి కోచింగ్ కావాలో పేర్లు ఇవ్వాలని అడిగారు. ఎంతమంది డాక్టర్ కావాలనుకుంటున్నారని ?డాక్టర్ కావాలంటే ఏం చదవాలని? అడిగారు. విద్యార్థినిలు బాగా చదివి తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి రాజ్ కుమార్, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ,ఆర్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.