28-02-2025 05:12:41 PM
ప్రిన్సిపాల్ అప్పని లక్ష్మణ్..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి అని వాగేశ్వరి కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్స్ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో వాగేశ్వరి కళాశాల ఆధ్వర్యంలో సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన "వీడ్కోలు సమావేశ" వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అప్పని లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
వాగేశ్వరి కాలశాలలో చదివిన పూర్వ విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, ఈ విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని అప్పుడే ఈ ప్రపంచంతో పోటీ పడగలమన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పుప్పిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెన్నంపెల్లి మహేందర్, గాదాసు సాగర్, గడిగొప్పుల శ్రీనివాస్, గుజ్జేటి నరేశ్, చంద వెంకటరమణ, చిలుకూరి వంశీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.