calender_icon.png 7 March, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదవాలి

06-03-2025 10:13:26 PM

జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి నాగరాణి..

కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నాగరాణి తెలిపారు. గురువారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ.నాగరాణి హాజరైనారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... పిల్లల చట్టాలు వారి హక్కుల గురించి మాట్లాడారు. బాల్య వివాహాల గురించి, POCSO చట్టం, గుడ్ టచ్, బాడ్ టచ్, పలు విషయాలు వివరించారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారని తక్కువ చేసి మాట్లాడితే వారికి మీరు మంచిగా చదివి మంచి స్థానంలో ఉండి వారికి చూయించాలన్నారు. మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి మంచిపేరు తీసుకురావాలని, మీ తోటి వారికి కూడా చెప్పాలని, విద్య ఎంత చెప్పితే అంత నైపుణ్యం అంతకింత పెరుగుతుందన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి కాల్ చేయాలన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, తల్లిదండ్రులకి కూడా తెలపాలన్నారు. శుభ్రత కూడా పాటించాలని సూచించారు. అన్ని సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎం. నర్సింహా రావు స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్ నవీన్ జ్యోతి, శశి రేఖ, అనురాధ, సీఎం విస్ అలీమొద్దీన్, అబ్దుల్ లతీఫ్, న్యాయ సేవ సిబ్బంది శ్రావణ్, ఉదయ, స్కూల్ టీచర్స్ & స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.