23-02-2025 06:57:27 PM
సింగరేణి మహిళా డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ హీరాలాల్ ఉపాధ్యాయ..
మందమర్రి (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సింగరేణి మహిళా డిగ్రీ పీజీ కళాశాల కరస్పాండెంట్ హీరోలాల్ ఉపాధ్యాయ కోరారు. మండలంలోని అందుగులపేటలోని సింగరేణి బాలికల జూనియర్ మహిళా డిగ్రీ పీజీ కళాశాల ఫేర్ వెల్ పార్టీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. త్వరలో జరగనున్న ఇంటర్ డిగ్రీ పీజీ పరీక్షలలో కళాశాల విద్యార్థులు పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రాబోయే పరీక్షలకు విద్యార్ధినులు సర్వం సన్నద్ధమై మంచి మార్కులు సాధించి కళాశాల పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు