calender_icon.png 1 April, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులు లక్ష్యంతో చదవాలి

28-03-2025 12:00:00 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి)  :  విద్యార్థినులు లక్ష్యంతో చదవి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్లగొండలోని పూర్వపు ఎస్‌ఆర్టీసీఈ ఆవరణలో నిర్వహిస్తున్న నిడమనూరు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు.

పలు సబ్జెక్టులపై ప్రశ్నలడిగి విద్యార్థినుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించారు. చురుకుగా సమాధానాలు చెప్పిన వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు. ఎండాకాలంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్  తినొద్దని చెప్పారు. పదో తరగతి విద్యార్థినులు పరీక్షలు బాగా రాయాలన్నారు.