బైంసా (విజయక్రాంతి): ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. భైంసా మండలం వానల్పాడ్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉదయం పూట ప్రత్యేక తరగతులను శుక్రవారం పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో ఉదయము, సాయంత్రం జిల్లా విద్యాశాఖ ద్వారా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రత్యేక తరగతులకు సబ్జెక్టు ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయులు విధిగా హాజరుకావాలనీ అన్నారు. ప్రతిరోజు విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు వివరాలను విద్యాశాఖ నుండి పంపబడిన Google spread sheet లో సరైన సమయానికి పూర్తి చేయాలని కోరారు.