calender_icon.png 4 March, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలి

04-03-2025 07:01:43 PM

లయన్స్ క్లబ్ సభ్యులు..

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల లయన్స్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. వీరి ఆధ్వర్యంలో మండలంలోని గుండెనెమ్లి గ్రామంలో మంగళవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల 40 విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్ లను పెన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

విద్యార్థి దశ నుండే కోరుకున్న లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని నేరవేర్చినప్పుడే మంచి జీవితం, భవిష్యత్తు ఏర్పడుతుందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు లయన్స్ క్లబ్ సభ్యులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సభ్యులు మండల లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గోపాల్, ట్రెజర్ జగదీష్, గ్రామ ప్రెసిడెంట్ రాంరెడ్డి, మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉమాకాంత్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.