calender_icon.png 3 March, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదవాలి

11-12-2024 04:29:03 PM

జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివినప్పుడే తాము అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారని జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి జే.నారాయణ పదవ తరగతి విద్యార్థులకు సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండ సాంగ్వి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన స్థాయిలు పరిశీలించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు పాల్గొన్నారు.