calender_icon.png 19 October, 2024 | 1:37 PM

లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థులు కష్టపడి చదవాలి

19-10-2024 11:18:51 AM

మంథని (విజయక్రాంతి): తమ కంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థులు ఆ లక్ష్యాన్ని సాధించేవరకు కష్టపడి చదవాలని మంథని సీఐ రాజు అన్నారు. ముత్తారం మండలంలోని దర్యాపూర్ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ లో సీఐ రాజు ముత్తారం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో మోడల్ పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులతో సైబర్ క్రైమ్,100 కాల్స్, మరియు షీ టీం పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థిని, విద్యార్థులు కష్టపడి చదివి, తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి, సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, విద్యార్థినిలు సెల్ఫోన్లను వాడకుండా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ వంటి వాటిని వాడకూడదని, వాటి వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు.

విద్యార్థులు తమ తోటి విద్యార్థినీయులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. మీకు ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ మిమ్మల్ని ఏమైనా ప్రలోభాలకు గురిచేసిన వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని, వాట్సాప్ డీపీలో తమ ఫోటోలు పెట్టుకోకూడదని వాటి వల్ల జరిగే అనర్థాలు గురించి వివరించారు. ఎవరైనా ఆకతాయిలు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, కళాశాల చుట్టుపక్క ఆవరణలో ఎవరైనా మద్యం సేవించినట్లయితే వెంటనే 100 కాల్ చేసి సమాచారం అందించాలని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.